TEJA NEWS

చందన వెల్లి గ్రామానికి చెందిన నలుగురు మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .

షాబాద్ మండలం చందన వెల్లి గ్రామ వాసులు శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో నేషనల్ హైవే పై రాత్రి ప్రమాదవశాత్తూ ఘోర రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై వికారాబాద్ లోని ఈషా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారి దగ్గరికి వెళ్ళి, పరామర్శించిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలన్నారు.

అదే యాక్సిడెంట్ లో నలుగురు వ్యక్తులు మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే … పరిగి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.