TEJA NEWS

పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణి
ప్రభుత్వ ఉన్నత పాఠశాల మహబూబాబాద్ లో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూక్య సిరి నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖాదికారి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి మరియు
స్టడీ మెటీరియల్ దాత

  • ప్రత్యేక ఆహ్వానితులు సుసృత ఫౌండేషన్ అధ్యక్షులు* ప్రభుత్వ మెడికల్ కళాశాల మహబూబాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జన్ డాక్టర్ మాలోతు రవీందర్ చౌకీదార్ తోపాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు……
  • ఈ సందర్భంగా అతిథి మరియు దాత డాక్టర్ మాలోత్ రవీందర్ చౌకిధర్ మాట్లాడుతూ ——-విద్యార్థులకు విజ్ఞానంతో పాటు, ఉన్నత విలువలతో కూడిన విద్యాభ్యాసాన్ని అభ్యసించి సమాజంలో ఉన్నతంగా ఎదగాలని, తద్వారా మంచి పౌరులుగా ఎదిగి సమాజాభివృద్ధికి తనవంతుగా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు

తల్లిదండ్రులు తమ పిల్లలను సరైన మార్గంలో నడిపించి, స్త్రీల పట్ల గౌరవభావం పెంపొందించే విధంగా, చెడు మార్గాలకు దూరంగా ఉండేటట్లు, సన్మార్గంలో వెళ్లే విధంగా వారిని నిరంతరం పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు
విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయుల పట్ల ఎల్లప్పుడు కూడా గౌరవభావంతో మెలగాలని విద్యార్థులకు తెలిపారు
మీరందరూ భవిష్యత్తులో అక్షరాస్యులుగా కాకుండా మంచి విలువలతో కూడిన విద్యావంతులుగా ఉండాలని కోరారు

ముఖ్య అతిథి
—— డాక్టర్ ఎ రవీందర్ రెడ్డి
జిల్లా విద్యాశాఖాదికారి , మహబూబాబాద్ గారు మాట్లాడుతూ…….
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్వేచ్ఛ వాతావరణంలో ఒత్తిడి లేని విద్యను అభ్యసిస్తున్నారు తద్వారా భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగి సమ సమాజ అభ్యున్నతికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు
రాబోయే పదవ తరగతి పరీక్షలలో అందరూ 100% ఫలితాలను సాధించి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషిచేయాలని మరియు సమాజంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని కలగజేయాలని కోరారు
ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతుంటారు వారికి సుమారు 25000 వేల రూపాయల విలువ గల స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేస్తున్న డాక్టర్ రవీందర్ ని మీరు కూడా ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా ఎదిగి మీరందరూ కూడా మీ వంతుగా సమాజానికి చేయూతనివ్వాలని కోరారు

పాఠశాలలో ఉన్నత ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయుల సమక్షంలో ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజం పట్ల మంచి దృక్పథం సేవాతాత్పరత కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు

సభాధ్యక్షులు
భూక్య సిరి నాయక్ ప్రధానోపాధ్యాయులు

మా పాఠశాలలో తెలుగు ,ఇంగ్లీష్ మీడియం లో మొత్తం 84 మంది విద్యార్థులు పదవ తరగతి అభ్యసిస్తున్నారు మా ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల కృషితో ఈ సంవత్సరం తప్పక 100% ఫలితాలను సాధిస్తామని తెలియజేశారు
మా పాఠశాలలోని పిల్లలకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన డాక్టర్ రవీందర్ గారికి పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు
జిల్లా విద్యాశాఖాధికారి మాకు నిరంతరం పర్యవేక్షిస్తూ చేస్తూ, తగు సలహాలు సూచనలు ఇస్తూ, మార్గ నిర్దేశం చేస్తున్న డిఇఓ కి ధన్యవాదాలు

ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు


TEJA NEWS