స్వాతంత్య్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయి నగర్ లో మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ , 20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాంబశివరెడ్డి, జలగం చంద్రయ్య, నిరుడు యాదగిరి, దశరథ్, మంజునాథ్, కుమార్ రెడ్డి,నాయకులు కురుమూర్తి, నర్సింగ్ రావు,బలరామ్, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు