TEJA NEWS

అలరించిన బాలల దినోత్సవ వేడుకలు

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరక్టర్ మాట్లాడుతూ “”భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు అని అన్నారు. అదే విధంగా మన దేశంలో ఉన్న ఐఐటి లు, ఎయిమ్స్ లు నెహ్రూ ఆలోచనలకి అనుగుణంగా స్థాపించబడ్డాయి. ఈ విద్యాసంస్థలు ప్రపంచం గర్వించే విద్యార్థులను తయారు చేస్తున్నయి అని అన్నారు.ప్రపంచంలో గొప్ప స్థాయిలో ఉన్న గూగుల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ లు మనదేశానికి చెందిన వారే అని ,అదే విధంగా USA ప్రెసిడెంట్ ట్రంప్ కేబినెట్ లో ఉన్నత స్థాయి లో ఉన్న సీమ వర్మ లో మన దేశ మూలాలు ఉన్నాయి అని అన్నారు .

విద్యార్థులు బాగా చదువుకొని వారి లాగే ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు , నాటికలు ప్రేక్షకులను అలరించాయి. విద్యార్థులు వేసిన కార్టూన్స్, పువ్వులు, పండ్లు, కూరగాయలు, స్వతంత్ర సమరయోధులు, నవదుర్గలు, వివిధ రకాల వృత్తుల వేషాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఉమ్మడి కుటుంబం పైన చేసిన నృత్యం, తల్లి యొక్క గొప్పతనం పైన చేసిన నాటిక, మొబైల్ ఫోన్ యొక్క నష్టాలను గురించి వివరించే నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. తల్లిదండ్రుల యొక్క గొప్పతనం గురించి చేసిన నాటిక చూపరులను కంటతడి పెట్టించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హరిచరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు, అజిత , రజిత , ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు


TEJA NEWS