TEJA NEWS

భావి భారత నిర్మాతలు విద్యార్థులే………………
సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హరిప్రసాద్ రెడ్డి
వనపర్తి

మన దేశ భావి భారత నిర్మతలు విద్యార్థులే అని ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాపర్లలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం మరియు బాలల దినోత్సవం సందర్భంగా ఎస్సై ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాపర్లలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభం చేసారు. అనంతరం ఆయన మాట్లాడారు. తాను కూడా చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువు కున్నాను. చదువు ద్వారనే మనం ఉన్నతస్థితికి ఎదుగుతాము అన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువు తున్నారో తెలుసుకోవటానికి తప్పని సరిగా పేరెంట్స్ మీటింగ్ హాజారు కావాలి అన్నారు. తల్లిదండ్రులు తప్పని సరిగా పిల్లలతో రోజు మాట్లాడాలని వారితో గడపాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు కోలాటం, నృత్యాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్దలను ఆకట్టుకునాయి. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెల్పొందిన విద్యార్థులకు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హరిప్రసాద్ రెడ్డి బహుమతులు అందించారు. . ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పలుస శంకర్ గౌడ్ అద్యక్షత వహించారు. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ జయమ్మ, రైతు సంఘం నాయకులు స్వరాజ్యం బాబు రెడ్డి, ఉపాధ్యాయులు,h వెంకటేశ్వర్లు, ఈశ్వర్ రెడ్డి, బాలమ్మ, ఇందిర, రమేష్, విద్యా వాలంటీర్లు. కవిత, శివాని, తల్లిదండ్రులు మరియు పెద్దలు ఫాల్గొనారు.


TEJA NEWS