TEJA NEWS

కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..!!

భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్‌ షర్ట్స్‌ వేసుకుని..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

భట్టి విక్రమార్క సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు హరీష్ రావు. భవిష్యత్తులో సీఎం అయితారామే అని కూడా అసెంబ్లీలో హరీష్ రావు పేర్కొన్నారు. 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఏడాది పాలనలో చేసిన అప్పు రూ. 1,27,208.. ఇలానే కొనసాగితే 5 ఏళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు అని వివరించారు హరీష్ రావు.

ఇక అంతకు ముందు బ్లాక్ షర్టులతో అసెంబ్లీకి BRS ఎమ్మెల్యేలు రావడం జరిగింది. నిన్న లగచర్ల ఘటనపై చర్చకు అనుమతించకపోవడంతో నిరసన తెలియజేస్తూ బ్లాక్ షర్ట్ లతో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ తరునంలోనే… అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. చేతులకు బేడీలు వేసుకొని నిరసన తెలిపారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు.


TEJA NEWS