TEJA NEWS

భౌరంపేట్ లో గాంధీ జయంతి వేడుకలు…. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు మరియు నాయకులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సత్యం, అహింస ఆయుధాలుగా భారత దేశపు స్వేచ్ఛా స్వాతంత్ర్య సమరాన్ని ముందుండి నడిపిన జాతిపిత గాంధీజీ అని అన్నారు. సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , , డైరెక్టర్లు భీం రెడ్డి , సత్తిరెడ్డి , మహిపాల్ రెడ్డి , నాయకులు ధర్మారెడ్డి , మన్నె శేఖర్ , విష్ణువర్ధన్ రెడ్డి , విరేశం తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS