
సెంట్రల్ నియోజకవర్గంలోని పాతపాడు విలేజ్ కండ్రిక నందు గంగనమ్మ అమ్మవారి మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అయినది…
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా:- ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముందుగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని టెంకాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు…
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆఅమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. దర్శనం అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వికరించి ఈ సంవత్సరం ఉత్సవాలు వైభవంగా జరగాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలు భగవంతుని దర్శనం చేసుకోవాలని తెలిపారు…
ఈ కార్యక్రమంలో:- శ్రీనాథ్, పొన్నం శేషగిరి, కాకోళ్ళు రవికుమార్, దేవి రెడ్డి శంకర్ రెడ్డి, హరిబాబు, పలగాని రాజశేఖర్,M శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు….
