TEJA NEWS

బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బాలుడు
ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల వినతి..
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

రెక్కాడితే గాని డొక్కాని పేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పొద్దస్తమానం కూలి పనులు చేస్తే గాని పూట గడువని కుటుంబం. ఇంతలోనే వారి జీవితాన్ని విధి పగబట్టింది. ఆ ఇంట్లో 12 సంవత్సరాల బాలుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కుమారుడి పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాణతీతం. దాతలు సాయం చేసిన తన కుమారుడిని బతికించాలని ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం చెందిన షేక్ ఖాసీం, సోందాబేగంల కుమారుడు ఉబేద్ (12) కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురైనాడు. ఖమ్మంలో వైద్యుల వద్ద చూపించగా బ్రెయిన్ ట్యూమర్ అని నిర్దారించారు. హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అప్పు సప్పు చేసి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స కోసం రూ. 5 లక్షలు అవుతాయని తెలపడంతో తెల్లమోఖం వేశారు. అసలే పేద కుటుంబం అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక తల్లిదండ్రులు కుమారుడి పరిస్థితిని చూస్తూ తల్లడిల్లిపోతున్నారు. దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సహాయం చేయాలనుకునే దాతలు ఫోన్ పే నంబర్ 9603524949 చేయాలని కోరుతున్నారు.


TEJA NEWS