TEJA NEWS

Giving sewing machines to women's groups is commendable

మహిళా సంఘాలకు కుట్టు మిషన్లు ఇవ్వడం అభినందనీయం
…..

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టి డి ఎఫ్)వనిత చేయూత ప్రాజెక్ట్ లో భాగంగా, రంగారెడ్డి జిల్లా,శంకర్ పల్లి మండలం, మోకిలా గ్రామంలో మోకిలా మహిళ శక్తి సంఘాల మహిళలకు పది కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందని టి డి ఎఫ్ వనిత చేయూత అధ్యక్షురాలు శ్రీమతి వాణి తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్ కుట్టే బాధ్యత ఈ సంఘాలకు ఇవ్వడం జరిగింది.మోకిలా మహిళ శక్తి సంఘాల విజ్ఞప్తి మేరకు టి డి ఎఫ్ ముందుకు వచ్చి వారికి పది కొట్టు మిషిన్లు వితరణ చేయడం జరిగింది.టి డి ఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్ మహిళ సాధికారత కోసం చేస్తున్న పనిని కొనియాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు గర్వంగా ఉందని తెలియజేశారు. ముఖ్యంగా మహిళా సంఘాలు వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి మోకిలా స్కూల్ హెడ్మాస్టర్ పద్మజ, వి ఆర్ వో సుజాత,అమ్మ ఆదర్శ కమిటీ మెంబరు పద్మ,కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుధాకర్,భీమయ్య, అనంతయ్య,అశోక్ మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


TEJA NEWS