గ్లో ఎల్ఈడి బల్బులను ట్యూబ్లైట్లను అతి తక్కువ ధరకు కేవలం 37/- రూపాయల కె 9W బల్బ్, 110/-రూపాయలకే 20W 4 ఫీట్ ట్యూబ్ లైట్ లను ఆవిష్కరించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇంత తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అభినందనియం అని, మన హైదరాబాదులో ఇండస్ట్రీ పెట్టి 200 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 1300 పైగా ఉత్పత్తులను తయారు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గవర్నమెంట్ కూడా హైదరాబాదులో తయారు చేసే ఇటువంటి కంపెనీలకు అవకాశం ఇచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ సందర్భంగా గ్లో ఎల్ఈడి ఎండి బొంతు సాంబి రెడ్డి తో అన్నారు. ఎండి సామి రెడ్డి మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా గ్లో ఎల్ఈడి అతి తక్కువ ధరలో మంచి నాణ్యతతో 13 వేల మంది వినియోగదారులకు సర్వీస్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నల్లగండ్ల గ్లో ఎల్ఈడి ఛానల్ పార్ట్నర్ సిద్ధార్థ మరియు గ్లో ఎల్ఈడి ఫ్యాక్టరీ అవుట్ లెట్ డైరెక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.