TEJA NEWS

మైలవరం నియోజకవర్గంలో గొల్లపూడి ఫ్లై ఓవర్, కొండపల్లి రైల్వే స్టేషన్, రాయనపాడు సాటిలైట్ రైల్వే స్టేషన్ లను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి పరిశీలించడం జరిగింది…

మైలవరం నియోజకవర్గంలో నెలకొన్న రైల్వే సమస్యలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వివరించడం జరిగింది… విజయవాడలో రేపు జరగబోయే డిఆర్ఎం మీటింగ్ లో మైలవరం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది…

రాయనపాడు రైల్వే స్టేషన్ లోని రద్దీను దృష్టిలో ఉంచుకొని రాయనపాడు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయడం జరుగుతుంది… కొండపల్లి రైల్వే స్టేషన్ ను కూడా అమృత్ భారత్ పథకం కింద ఎంపికై అభివృద్ధి జరిగే విధంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సహకారంతో కృషి చేస్తాము…

రాయనపాడు రైల్వే స్టేషన్ లో మూడు మరియు నాలుగు నెంబర్ల ఫ్లాట్ ఫార్మ్స్ కూడా రెడీ కాబోతున్నాయి… రాయనపాడు రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం కాబోతుంది, ఇక్కడ మరిన్ని రైలు ఆగే విధంగా చూస్తాము…