TEJA NEWS

కావూరు నాదెండ్ల గ్రామాలు పర్యటించి పార్టీ కార్యకర్తలకు నివాళులర్పించిన ప్రత్తిపాటి

చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, అవిశాయపాలెం గ్రామంలో జరుగుచున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు కార్యదర్శి గుర్రం నాగపూర్ణచంద్రరావు అత్తయ్య పునాటి స్వరాజ్యమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …


చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం, కావూరు గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘాల అధ్యక్షులు కందుల పేరయ్య సోదరుని కుమారుడు కందుల ప్రభాకరరావు మృతి చెందగా, వారి మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, అనంతరం వారికి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు .
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు , మద్దూరి వీరారెడ్డి , జవ్వాజి మదన్ , కామినేని సాయిబాబా , కోడె హనుమంతరావు , మద్దాలి వెంకట ప్రసాద్, రాధాకృష్ణ మూర్తి, హరిగోపాలరావు, నాగేశ్వరరావు , మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు..