సుపరిపాలన అంటే రామరాజ్యమే రాష్ట్రపతి ముర్ము

సుపరిపాలన అంటే రామరాజ్యమే రాష్ట్రపతి ముర్ము

TEJA NEWS

సుపరిపాలన అంటే రామరాజ్యమే రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ: సాహసం, కరుణ, కర్తవ్యనిష్ఠకు శ్రీరాముడు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు.

11 రోజులుగా అనుష్ఠాన దీక్ష పాటిస్తున్న ప్రధానిని అభినందించారు. శ్రీరాముడు మన అత్యుత్తమ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాలకు ప్రతినిధి అని చెప్పారు. సుపరిపాలన అంటే రామరాజ్యమే గుర్తొస్తుందని పేర్కొన్నారు. ఆయన జీవితం , సిద్ధాంతాలు మన చరిత్రలో అనేక భాగాలపై ప్రభావం చూపించాయని, దేశ నిర్మాతలకు ప్రేరణనిచ్చాయని తెలిపారు. సత్యనిష్ఠ గొప్పతనాన్ని రాముడి వల్లే గ్రహించానని గాంధీజీ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. రామమందిర ప్రారంభోత్సవంతో దేశమంతా పండుగ వాతావరణం నెలకొందన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS