TEJA NEWS

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో క్రిస్మస్‌ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రిస్మస్ పండగకు సెలవులను ప్రకటించింది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ వరుసగా మూడు రోజులు సెలవులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 24 నుంచి 26 వరకు ప్రభుత్వం క్రిస్మస్ సెలవులను ప్రకటించింది. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్ కాగా, 26న బాక్సింగ్ డేతోపాటు జనరల్ హాలీడే కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.


TEJA NEWS