TEJA NEWS

ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్

శంకర్‌పల్లి: ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ఆసుపత్రులు మెరుగుపరచాలని సూచించారు. పని గంటలలో అందుబాటులో ఉండాలన్నారు. సిజేరియన్స్, సి సెక్షన్ తగ్గించాలి. అన్ని రకాల మందులు వాడాలి. యాంటీబయాటిక్స్ వాడకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వైద్య అధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎం లు పాల్గొన్నారు.


TEJA NEWS