ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వము పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరు కాబడి పెగడ పెల్లి మండల కేంద్రంలో 12లక్ష రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి మరియు పెగడపెల్లి గ్రామంలో 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి అదే విధంగా CRR గ్రాంట్ కింద మంజూరు అయినా పెగడపెల్లి నుండి ఏడు మోటలపల్లి మీదుగా లంబాడి తాండ వరకు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణానికి మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
ఈ సంధర్బంగా 2 లక్షల రూపాయల విలువగల రెండు కళ్యాణ లక్ష్మీ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం పెగడపెల్లి మండలం సుద్ధపెల్లి గ్రామానికి చెందిన సిద్ధుల గంగయ్య విద్యుత్ఘతంతో మృతి చెందగా ప్రభుత్వం నుండి మజూరు అయిన 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రెషియ చెక్కును వారి కుటుంబానికి అందేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు