ప్రభుత్వ పాఠశాలలకు మరింత అభివృద్ధి చేస్తా..

TEJA NEWS

ప్రభుత్వ పాఠశాలలకు మరింత అభివృద్ధి చేస్తా…

విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే KR నాగరాజు …

గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్లోని ఎల్లాపూర్ గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.విద్యార్థులు,ఉపాధ్యాయులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు.అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కను నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో కూడిన విద్యను అందించడమే ద్యేయంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి విద్యార్థిని బాగా చదువుకొని దేశానికి వెన్నెముక కావాలని ఉద్దేశించారు.విద్యార్థులు మీ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని,మీరంతా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.స్థానికంగా ఉన్న నాయకులు సైతం పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో 65వ డివిజన్ అధ్యక్షులు సునీల్, ఎల్లాపూర్ గ్రామ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రాకేష్ రెడ్డి,మండల అధ్యక్షులు అశోక్,మాజీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అరుణ, భిక్షపతి,జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి,66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్,మహిళా ఉపాధ్యక్షురాలు స్వాతి,మాజీ ఎంపిటిసి సుదర్శన్,సీనియర్ నాయకులు ప్రకాష్,మధుసూదన్ రెడ్డి,కుమారస్వామి,అశోక్,డివిజన్ ముఖ్య నాయకులు,నాయకులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top