మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

TEJA NEWS

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

అర్హులందరికీ ఇందిరా మహిళా చీరలు అందిస్తాం: ఎమ్మెల్యే KR నాగరాజు …

హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట సమీపంలోని అమిత్ గార్డెన్స్ లో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా,ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరై గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్లోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. 200 యూనిట్లకు ఉచిత విద్యుత్,ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత బస్సు సౌకర్యం,ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు,నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్నం బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.స్వంత ఇంటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక, విద్యా, సామాజిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ అధ్యక్షులు చిర్ర రాము,55వ డివిజన్ అధ్యక్షులు గడ్డం అరుణ్,56వ డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు,66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్,మార్కెట్ డైరెక్టర్ రైతు రాజు,pacs చైర్మెన్ గోపాల్ రెడ్డి,సీనియర్ నాయకులు విసం సురేందర్ రెడ్డి,వెంకన్న,కనుపర్తి కిరణ్,రవి యాదవ్,నాయకులు,మహిళలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top