TEJA NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డా: రామచంద్రనాయక్

రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని… ఎమ్మెల్యే డా రామచంద్రనాయక్…

భూభారతి చట్టం దేశానికి ఆదర్శం…ఎమ్మెల్యే డా రామచంద్రనాయక్ …


డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం కందికొండ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డా. రామచంద్రనాయక్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులకు మద్దతు ధర అందించాలి, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి క్వింటాకు 500బోనస్ అందిస్తున్నట్లు గుర్తుకు చేశారు. రైతులకు ఉచిత కరెంట్, రుణ మాఫీ, రైతు భరోసా, 500బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు.

అందుకోసమే రాష్ట్రంలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహస్తుందని అన్నారు. దీనివల్ల మన రైతుల వద్దనే సన్నాలు కోని మళ్ళీ మనకే సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందువలన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్మాలని సూచించారు.

వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదని కావున కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. తేమ 17శాతం ఉండాలని, బస్తా 41కేజీలు మాత్రమే తూకం వేయాలని ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, అధికారులు, గ్రామ నాయకులు కార్యకర్తలు తదిపరులు పాల్గొన్నారు.