పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ వర్కర్స్& ఎంప్లాయిస్ ల ధర్నా
- సిబ్బందిని పర్మినెంట్ చేసి ప్రత్యేకబడ్జెట్ కేటాయించి జీతాలు చెల్లించాలని…… సిఐటియు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు డిమాండ్
తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ & వర్కర్స్ల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సిఐటియు యూనియన్ (సిఐటియు ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం తమ డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని పరిపాలన అధికారి, A O భాను ప్రకాష్ కి అందజేయడం జరిగింది,
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు మాట్లాడుతూ. గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని, ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించిన పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగులకు నేరుగా వేతనాలు ఇచ్చే విధంగా గ్రామపంచాయతీ సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించాలని. గ్రామపంచాయతీ సిబ్బంది లందరినీ పర్మినెంట్ చేయాలని. వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, రెండవ పిఆర్సి పరిధిలోకి గ్రామపంచాయతీ సిబ్బందిని తీసుకురావాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహకార దర్శులుగా నియమించాలని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని కోరారు, జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని. విలేజ్ వాటర్ అసిస్టెంట్లుగా నియమిస్తున్న సిబ్బందిని అందరికీ సీనియార్టీని పరిగణంలోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించి ఇతర శాఖలో చెల్లిస్తున్న వేతనాలను ఇవ్వాలి,
విధినిర్వహణలో ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి 10 లక్షల నష్టపరిచారని ప్రభుత్వమే ఇవ్వాలి దీని అమలు పోస్ట్ ఆఫీస్ బీమా పథకం ద్వారా వర్తింపజేయాలి, ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి సహజ మరణానికి ఇన్సూరెన్స్ పథకాన్ని ఐదు లక్షలకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2011 జనాభా ప్రకారం కాకుండా అవసర ప్రాతిపదికన కార్మికుల్ని తీసుకోవాలి ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ వేతనాలు పెంచాలి. ఆదాయం ఉన్న పంచాయతీలలో వేతనాలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని. కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో స్పందించి గ్రామాల్లో పంచాయతీ కార్మికుల మీద జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని కార్మికులకు రక్షణ కల్పించాలని కోరారు, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు, ఈ కార్యక్రమంలో, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్. జిల్లా సహాయ కార్యదర్శిలు. ఆర్యన్ రమేష్. సూర్యవంశం రాము. సిఐటియు జిల్లా నాయకులు. మధు. ఎన్ రాములు. తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్& వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు. పుష్ప. హనీ ప్ , ఎల్ల స్వామి, బాలకృష్ణ. రామచంద్రయ్య, విరాట్, పుల్లయ్య, నారాయణ,తదితరులు పాల్గొన్నారు