ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సైనిక్ అకాడమీ ఇన్ స్టిట్యూట్ లో నాయి బ్రాహ్మణుల కులదైవం ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు గొట్టిపర్తి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ధన్వంతరి స్వామి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరి అని,వ్యాధుల నివారణకు ధన్వంతరి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.ఆయుర్వేద వైద్యరంగం ధన్వంతరి చేసిన సేవలు మరువలేనివని అన్నారు.ఆయుర్వేద వైద్యంకు పూర్వకాలం నుంచే ప్రజల నమ్మకాన్ని పొందిందని అన్నారు. ఆయుర్వేద వైద్యంలో అనేక రకాల వ్యాధులు నయం అవుతాయన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి దూదిపాల ప్రవీణ్, కోశాధికారి నాగవల్లి యాకేష్, మామిడాల రాజు, కేసారం బద్రి, ఇటికూరి నాగరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.