
గ్రానైట్ వ్యర్ధాలతో పర్యావరణానికి పొంచి ఉన్న పెను ప్రమాదం
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి
కనిగిరి నియోజకవర్గం కనిగిరి పట్టణంలోని స్థానిక అమరావతి గ్రౌండ్స్ లో మైనింగ్, ఆర్ అండ్ బి అధికారులు మరియు గ్రానైట్ యజమానులతో మంగళవారం శాసనసభ్యులు డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా, నిర్దేశించిన నియమావళి ప్రకారం గ్రానైట్ వ్యర్ధాలను నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. గ్రానైట్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, పరిసరాల పర్యావరణం దెబ్బతింటుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మైనింగ్ శాఖ, ఆర్ అండ్ బి అధికారులు ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రానైట్ యజమానులు కూడా ప్రభుత్వ నిబంధనలను పాటించి వ్యర్ధాలను వర్గీకరించి, తగిన ప్రదేశాల్లో నే పంపించాలని హితవు పలికారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మైనింగ్ ఆర్ అండ్ బి అధికారులు మరియు గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు పాల్గొన్నారు.
