TEJA NEWS

హుస్నాబాద్ లో ఎస్సి బాలుర కళాశాల వసతి గృహాన్ని మంజూరు చేయండి..

*రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి

హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో ఎస్సి బాలుర కళాశాల వసతి గృహాన్ని మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి టీపీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి తో కలిసి AISF సిద్దిపేట జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్థన్ వినతిపత్రం అందజేశారు..
ఈ సందర్భంగా మంత్రితో వారు మాట్లాడుతూ హుస్నాబాద్ లో ఎస్సి బాలుర కళాశాల వసతి గృహం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,గతంలో చాలా సార్లు అధికారులకు,ప్రజాప్రతినిధులకు ఈ విషయాన్ని దృష్టి కి తీసుకెళ్లిన పట్టించుకోలేదని విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వసతి గృహన్నీ మంజూరు చేపించాలని కోరారు…


TEJA NEWS