ప్రజా సమస్యల పరిష్కారమే గ్రీవెన్స్ డే

TEJA NEWS

ప్రజా సమస్యల పరిష్కారమే గ్రీవెన్స్ డే

బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజ

బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ ఈ కార్యక్రమంలో ఆమెమాట్లాడుతూ.. ఈ గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజల నుంచి , డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీరు, జంగిల్ క్లియరెన్స్, కి సంబంధించిన అర్జీలను స్వీకరించడం జరిగిందని, తెలియజేశారు.

నా దృష్టికి సమస్య వచ్చిన వెంటనే అధికారులను పురమాయించి వీలైనంత త్వరగా పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని తెలియజేశారు.పట్టణంలో ఏ సమస్య ఉన్న నా దృష్టికి తేవాలని నావల్ల కానీ పక్షంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ గ్రీవెన్స్ డే ను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇనమల చినబాబు, పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top