ఇస్లామిక్ సెంటర్లో ముఖ్య అతిథిగా gunti swapna

ఇస్లామిక్ సెంటర్లో ముఖ్య అతిథిగా gunti swapna

TEJA NEWS

హనుమకొండ జిల్లా పశ్చిమ నియోజకవర్గ(21-01-2024)
ఈరోజు జాతీయ బాలికల విద్యా దినోత్సవం సందర్భంగా రాయపూర్ ఇస్లామిక్ సెంటర్లో ముఖ్య అతిథిగా gunti swapna పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మగ పిల్లలైనా ,ఆడపిల్లలైనా జీవితంలో విద్య అనేది ఒక ముఖ్యమైన భాగము.
మహిళల హక్కులను పరిరక్షించడంలో విద్య అత్యంత కీలకము.
విద్య అంటే జ్ఞానము అది స్త్రీ కూడా అవసరమే, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు పెద్దలు. ఒక మగాడు చదివితే అతనికి ఒక్కడికే ఉపయోగం. కానీ ఒక స్త్రీ చదివితే ఆమె కుటుంబం చదివినట్లే . ప్రాచీన కాలంలో స్త్రీలు కూడా సకల కళాకోవిదులై ఉండేవారు. సమస్త విద్యలనుఅభ్యసించేవారు. మధ్యకాలంలో స్త్రీలు విద్యకు కొంచెం దూరమైనా కానీ. ఆధునిక కాలంలో స్త్రీ విద్య ద్వారా జాతీయ నుండి అంతరిక్షం వరకు ప్రతి రంగంలోనూ నేడు మహిళలు దూసుకుపోతున్నారు.
మహిళా విద్యకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు
*విద్యా ఉపాధి రంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
*వివిధ జాతీయ విధానాలను-1968,1986,2020.
*విద్యాహక్కు చట్టం 2009 ద్వారా 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య.
ప్రభుత్వాలు మహిళల అక్షరాస్యత కొరకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్నది .లింగ నిష్పత్తిలతో తేడా, బాలికల లింగ నిష్పత్తిలో తేడా ,వరకట్నం ,లైంగిక వేధింపులు, గృహహింస పాలన ,మరియు రాజకీయాల్లో ఎక్కువ ప్రాతినిథ్యం ఇవ్వకపోవడం ప్రధాన సమస్యగా నేటికీ ఉన్నాయి.
కాబట్టి మొదటగా బాలికలను కచ్చితంగా ఉన్నత విద్యావైపు పయనింపజేయాలని విద్య యొక్క ఆవశ్యకత వాళ్లకు తెలియజేసి, స్త్రీలు విద్యతో పాటు ఆర్థిక స్వాతంత్రం కూడా కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS