TEJA NEWS

హైదరాబాద్:

తెలంగాణ గురుకుల విద్యా లయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న 35 గురుకుల జూనియర్ కళా శాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సర ములో ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి ప్రవేశాలకు ఈ నెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహించను న్నారు.

ఇందు కోసం తెలంగాణలో ని 33 జిల్లాల విద్యార్థుల నుండి ఆన్ లైన్ (http:// tsrjdc.cgg.gov.in) ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.

విద్యార్థులు జిల్లా కేంద్రాలు హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట,

సంగారెడ్డి జిల్లాలలో ప్రవేశ పరీక్ష 21-న ఉదయం. 10 గం.ల నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యా లయాల సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణకుమార్ తెలిపారు.

సంబందిత పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే చేరు కోవాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించిన 73,527 మంది విద్యార్థు లలో సుమారు 60 వేల మంది విద్యార్థులు ఇప్ప టివరకు హాల్టికెటు డౌన్లోడ్ చేసుకున్నారని మిగిలిన విద్యార్థులు పైన తెలిపిన అన్ లైన్ ద్వారా ఈ నెల 21న ఉదయం 8 గం.ల వరకు హాల్ టికెట్స్ పొందవచ్చని తెలిపారు. కేటాయించిన పరీక్ష కేంద్రా లను ఒకరోజు ముందుగా చూడాలని తెలిపారు.


TEJA NEWS