రామ భక్త హనుమాన్ గుణాలు ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్, తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ రామడుగు రాంబాబులు అన్నారు
హనుమ జయంతి సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీ భానుపురి శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో స్థానిక భగవద్గీత మందిరంలో ఏర్పాటు చేసిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో వారు పాల్గొని మాట్లాడారు. హనుమంతుడి సేవ పరాయణత్వం, వినయ విధేయతలు, ధైర్య సాహసాలు, అంకిత భావం సమాజానికి ఎంతో ఆదర్శమన్నారు. మహిమాన్వితమైన ముక్తిదాయకమైన హనుమంతుడిని ధ్యానిస్తే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుందన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ భానుపురి శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు
ఈ కార్యక్రమంలో భానుపురి శ్రీనివాస భజన మండలి అధ్యక్షులు నాగవేల్లి దశరథ, రాగి భాస్కరాచారి, మొరిశెట్టి రామ్మూర్తి, రాగి శ్రీనివాసచారి, వీరయ్య, నాగవెల్లి ప్రభాకర్, కమటాల వెంకటేశ్వర్లు, వీరారెడ్డి, సత్తిరెడ్డితో పాటు ఆధ్యాత్మికవేత్తలు, హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.