TEJA NEWS

ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసిపోయి మళ్ళీ గెలిచి రావాలని కోరిన…………మాజీమంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి :
పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో కలిసిపోయి ప్రజాప్రతినిధులుగా తిరిగి మళ్లీ గెలిచి రావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలోని మండలాల ప్రజా ప్రతినిధులను కోరారు పదవి కాలం ముగుస్తున్న జడ్పిటిసి ఎంపీటీసీ ఎంపీపీ ల ప్రజా ప్రతినిధుల ను ఆయన శాలువాలు పూలదండలతో సన్మానించి పదవి కాలం దిగ్విజయంగా ముగించుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని పదవిలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు పదవి కాలం ముగిసిన ప్రజాప్రతినిధులు ప్రజల్లో మమేకమై ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మళ్లీ గెలిచి పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు సన్మాన గ్రహీతలుగా కృష్ణా నాయక్, సేనాపతి, సామ్య నాయక్ పద్మ వెంకటేష్ ఎంపీటీసీలు జిల్లా నాయకులు గట్టు బి. లక్ష్మయ్య,వాకిటి శ్రీధర్
నందిమల్ల అశోక్ పి రమేష్ గౌడ్ పరంజ్యోతి మండల పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య వేణు వెంకట్ స్వామి తిరుపతయ్య చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS