TEJA NEWS

తనకు నియోజకవర్గ అభివృద్ధి మీద తప్పా.. మరే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని, అభివృద్ధి పనులు తప్పా.. పైరవీల గూర్చి నేనెప్పుడూ ఏ ముఖ్యమంత్రి దగ్గరకు ఒక్క కాగితం తీసుకుపోలేదని.. నాకు ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేశారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మెన్ ఆరేకపూడి గాంధీ. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రూ.1606 కోట్ల నిధులు కేటాయించారని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ,నా తరుపున ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కై రూ. 1606 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం అని, హర్షం వ్యక్తం చేయాడం జరిగినది. శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామి నియోజవర్గంగా తీర్చిదిద్దుతామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.1606 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన అభివృద్ధి పనులు

  1. మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్/ గ్రేడ్ సపరేటర్స్ 3 జంక్షన్స్ Rs.837.00 కోట్ల రూపాయలతో జంక్షన్ల అభివృద్ధి.

a. ఖాజాగూడ జంక్షన్
b. III T జంక్షన్
c. విప్రో జంక్షన్

2.రూ. 39.00 కోట్ల రూపాయలతో సీపీ సైబరాబాద్ కార్యాలయం నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు 215 అడుగుల రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు

  1. రూ.Rs.31 కోట్ల రూపాయలతో అంజయ్య నగర్ నుండి రాంకీ టవర్ వరకు 150 అడుగుల వరకు రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి పనులకు

4.రూ. 45 కోట్ల రూపాయలతో NH 65 నుండి అమీన్‌పూర్ వరకు 150/100 అడుగుల రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి పనులకు

  1. రూ.530 కోట్ల రూపాయల తో మియాపూర్ చౌరస్తా నుండి నుండి ఆల్విన్ చౌరస్తా వరకు 6 లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ మరియు లింగంపల్లి నుండి గచ్చిబౌలి వరకు 3 లేన్ యూని డైరెక్షనల్ అండర్ పాస్ నిర్మాణం పనులకు

6.రూ. 124 కోట్ల రూపాయలతో శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ROB నిర్మాణం పనులకు
మొత్తము రూ..1606.00 కోట్ల రూపాయల నిధులు మంజూరి చేయడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

అదేవిధంగా ప్రగతి నగర్ నుండి జేఎన్టీయూ వరకు, ఉషాముళ్లపూడి రోడ్డు విస్తరణ, అభివృద్ధి కోసం మరో రూ. 1000 కోట్లు కేటాయించాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. అపర్ణ నుండి గంగారం, శ్రీదేవి రోడ్డును కూడా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. గాంధీకి అభివృద్ధి ఎజెండా మినహా, అవినీతి ఎజెండా లేదని, తాను గత 11 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నానని, తన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని ఏ పార్టీ అని అడగకుండా పనులు చేశానని, మచ్చలేని మనిషిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సదా రుణపడి ఉంటానని గాంధీ తెలిపారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. నాపై కావాలని బురద చల్లేందుకు ఎవరు ప్రయత్నించినా సహించనని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతదూరమైన వెళ్తా.. అవినీతి ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని, నా మీద దృష్ప్రచారం చేయడం మానుకోండని హితవు పలికారు.

అరగుంట కబ్జా అని తెలిచి మీకే ఇచ్చేస్తా.. PAC చైర్మన్ గాంధీ

తాను కబ్జాలకు పాల్పడినట్లు ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనంలో ఎలాంటి నిజం లేదని, తాను కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మెన్ ఆరేకపూడి గాంధీ ప్రకటించారు. తాను గతంలోనే 33 ఏండ్ల చరిత్ర కలిగిన భూమి ని ప్రభుత్వ నిబంధనలకు లోబడి భూమిని కొనుగోలు చేశానని అన్నారు. నిన్న 30 ఎకరాల కబ్జా అని రాసిన వారే ఇవాళ 6 ఎకరాల కబ్జా అని రాశారని, అది రేపటికి 4 ఎకరాలు అవుతుందని వారు రాసింది వారికే స్పష్టతలేదని అన్నారు. తాను కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను, ఇతర కాగితాలను మీడియా ముందు ఉంచారు. ఎక్కడైనా తాను నిబంధనలకు విరుద్ధంగా భూమిని పొందినట్లు కానీ, అవినీతికి పాల్పడినట్లు కానీ నిరూపించక పోతే సంబంధిత పత్రికపై, అలాగే అవాస్తవాలు ప్రసారం చేసిన ఎంతటి వారైనా వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు మరియు పరువునష్టం దావా కేసు వేస్తానని PAC చైర్మన్ గాంధీ తెలిపారు.


TEJA NEWS