
మైలవరం నియోజకవర్గం నుంచి స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు సారథ్యంలో అమరావతి పనుల పునః ప్రారంభానికి భారీగా తరలిన ప్రజలు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్,
మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఇచ్చిన పిలుపు మేరకు అమరావతి పనుల పునఃప్రారంభానికి నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివెళ్లారు.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్రమోదీ పాల్గొనే సభకు హాజరయ్యేందుకు వెళుతున్న బస్సులను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారితో మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. వారికి కావలసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలను అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు తో మాట్లాడుతూ అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం పట్ల హర్షం చేశారు. తమ కోసం తమ బిడ్డల భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యంగా మైలవరం నియోజకవర్గం కూడా అమరావతిలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టమన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఎంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ తన విజ్ఞప్తిని మన్నించి మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఏపీ ఏకైక రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి భారీగా తరలి వెళ్ళిన ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎండ తీవ్రత విపరీతంగా వున్నా అమరావతి రాజధానిపై ఉన్న మమకారంతో భారీగా ప్రజలు తరలి రావడం శుభ పరిణామం అన్నారు. స్థానిక ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
