TEJA NEWS

Cold weather.. heavy rains with strong winds for the next 5 days..

చల్లని కబురు.. వచ్చే 5 రోజులు ఈదురు గాలుతో కూడిన భారీ వర్షాలు..

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ముంబై, తెలంగాణతో సహా మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన చేసింది. ముంబయి, మరఠ్వాడా, కొంకణ్ గోవా, మధ్య కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది.

మరోవైపు కోస్తాంధ్రా, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

దీంతో రానున్న 5 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బెంగాల్, సిక్కింలలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.


TEJA NEWS