TEJA NEWS

సర్వీస్ రోడ్డు పక్కన నిర్మిస్తున్న కెనాల్ పనుల గురించి హైవే అథారిటీ అధికారులతో చర్చిస్తున్న ప్రజల మనిషి రాజన్న

చౌటుప్పల పట్టణంలో సర్వీస్ రోడ్డు వెంబడి నిర్మిస్తున్న కెనాల్(కాలువ)పనులను
మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు
సర్వీస్ రోడ్డు మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర నుండి గాంధీపార్క్ వరకు కలియదిరిగి డ్రైనేజీ సమస్య పరిష్కారానికి
హైవే అథారిటీ భీమ్సెన్ చౌదరి, ప్రాజెక్ట్ మేనేజర్ మరియు సంజీవ అథారిటీ మేనేజర్ తో
మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహా రెడ్డి, MRO హరికృష్ణ, ఇరిగేషన్ DE రాజ వర్ధన్ రెడ్డి తో సమావేశం ఏర్పాటు చేసి వర్షాకాలంలో వచ్చినటువంటి వరద నీటి సమస్య పరిష్కారం దిశగా తగు సూచనలు తెలియజేయడం జరిగింది. తదనంతరం తంగడిపల్లి రోడ్డులో ఉన్నటువంటి
నాగులకుంట సుందరీకరణ పనులను పర్యవేక్షించి ఇంజనీరింగ్ సెక్షన్ వారికి ఇరిగేషన్ వారికి కల్వర్టు నిర్మాణం గురించి తగు సూచనలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పబ్బు రాజు,ఉబ్బు వెంకటయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేన రెడ్డి,టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, కౌన్సిలర్ బండమీద మల్లేష్, మొగుధాల రమేష్, వీరమల్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS