కలెక్టర్ చేత మున్సిపల్ కమిషనర్ సన్మానం..
చిలకలూరిపేట పట్టణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన మొంతా తుఫాన్ సమయంలో ప్రజల భద్రతకై కీలకంగా పనిచేసిన మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబును కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం,వర్డ్లు మరియు కాలనీల్లో మునిసిపల్ సిబ్బందిని వేగంగా పనిచేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టడం, అవసరమైన సాయం – త్రాగునీరు, విద్యుత్, వైద్య సహాయం తదితరాలను సమయానికి అందించడంలో కమిషనర్ చూపిన కృషిని కలెక్టర్ ప్రశంసించారు.తుఫాన్ తర్వాత పట్టణంలో నీటి నిల్వలు తొలగించడం, మలినాల నివారణ, రోడ్ల పరిశుభ్రత,చెత్త మోటర్ల ద్వారా డ్రైనేజ్ వ్యవస్థను సాధారణ స్థితికి తేవడం వంటి చర్యలను శ్రీహరి బాబు వ్యక్తిగతంగా పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు.ఈ చొరవ వలన చిలకలూరిపేట నగరంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నివారించగలిగామని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్లా పి. శ్రీహరి బాబుకు ప్రశంసాపత్రం అందజేసి, భవిష్యత్తులో కూడా పట్టణ అభివృద్ధికి మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
