TEJA NEWS

సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం పంచుకోవడానికి పోటీపడ్డారు. గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. ఈ తంతు తేలక పోవడంతో రెండు రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉంది. దహన సంస్కారాలు ఆలస్యం చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.


TEJA NEWS