బంగారు మైసమ్మ దేవాలయానికి భారీ విరాళం
రూ. 3.69 లక్షలు ప్రకటించిన బీఆర్ఎస్ యువ నేత “నందారం అశోక్ యాదవ్”
షాద్ నగర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు యాదవ కాలనీలో గల బంగారు మైసమ్మ దేవాలయ అభివృద్ధికి భారత రాష్ట్ర సమితి షాద్ నగర్ పట్టణ యువనేత నందారం అశోక్ యాదవ్ భారీ విరాళం ప్రకటించారు. యాదవ కాలనీ పెద్దలు నడికుడ రఘునాథ్ యాదవ్ అశోక్ యాదవ్ సంతోష్ యాదవ్ రవికుమార్ యాదవ్ సురేష్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గోపాల్ యాదవ్ తదితరుల సమక్షంలో రూ. 3.69 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా యాదవ సోదరులు నందారం అశోక్ యాదవ్ ను అభినందించారు. ఆధ్యాత్మిక చింతనలో నిత్యం సేవలు అందిస్తూ, ఆలయాల నిర్మాణాలను ఒక యజ్ఞంలా భావించి సేవలు అందిస్తున్న అశోక్ యాదవ్ ది గొప్ప మనసుని పలువురు కొనియాడారు..