డాక్టర్ల కొరత, సమస్యల లేమితో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి
అధికారులు, ప్రజా ప్రతినిధుల చొరవతో వైద్యాన్ని అందించాలని కలెక్టర్కు బిజెపిఫిర్యాదు
వనపర్తి : జిల్లా కేంద్రంలో ఉన్న నిరుపేదల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుందని దీంతో నిరుపేదలు ఆరోగ్య సేవలు అందక పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విశాలమైన భవనము అధునాతనమైన పరికరాలతో ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరతకనీస సౌకర్యాలు లేమితో చిన్న చిన్న చికిత్సలు కూడా చేయకుండా మహబూబ్నగర్ హైదరాబాద్ లకు రెఫర్ చేస్తూ వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిని ఓ రెఫరల్ కేంద్రంగా మార్చారని ఆరోగ్యశాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రజావాణి కార్యక్రమంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం బిజెపి రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి శ్రీశైలం బండారు కుమారస్వామి జిల్లా ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏ సీతారాములు పట్టణ అధ్యక్షులు బచ్చు రాములు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల్ ఫుల్ డాక్టర్లు నిల్ అన్న చందంగా తయారైందని పేరుకే 100 పడకల ఆసుపత్రి అని ప్రతి విభాగంలో ఉండాల్సిన డాక్టర్లు లేక ఆసుపత్రి మొత్తానికి ఒకరిద్దరూ డాక్టర్లచే నెట్టుకొస్తున్నారని దీంతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందలేక ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సను కొనలేక ఇబ్బందులు పడుతున్నారని సీరియస్ గా ఉన్న పేషంట్ల ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటూ వారి ఇల్లు వాకిళ్లను తాకట్టు పెట్టు అమ్మో వైద్యం చేయించుకుంటున్నారు వైద్యం చేయించుకున్న ప్రాణాలు నిలవని కుటుంబాలు సంపాదించే ఇంటి పెద్దను కోల్పోవడంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని వారి పిల్లలు అనాధలుగా సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి సమస్యల పట్ల నిర్లక్ష్యం వీడి ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ వైద్యాధికారులు నిరుపేదలకు మెరుగన్న వైద్యం అందించాలని లేకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుమిత్రమ్మ జిల్లా నాయకులు ఓం ప్రకాష్ చారి పట్టణ ప్రధాన కార్యదర్శి మామిళ్ళపల్లి రాయన్న సాగర్ ఎస్సీ మోర్చా నాయకులు నరసింహ జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.