TEJA NEWS

*Hyderabada Rising ఉత్సవం కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కై H-CITI లో రూ.1606.00 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ *

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా Hyderabada Rising ఉత్సవంలో భాగంగా నెక్లెస్ రోడ్డు HMDA మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ సలహాదారులు వేంనరేందర్ రెడ్డి , శాసన మండలి చీఫ్ విప్ , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం , ఎమ్మెల్యే దానం నాగేందర్ , మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మీ తో కలిసి పాల్గొన్న PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కై H-CITI లో రూ.1606.00 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ,నా తరుపున ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. ప్రజా పాలన లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ది ,సంక్షేమం తో తెలంగాణ అభివృద్ధి పథంలో ముదుకుపోతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కై రూ. 1606 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం అని, హర్షం వ్యక్తం చేయాడం జరిగినది. శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామి నియోజవర్గంగా తీర్చిదిద్దుతామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రూ. 5,827 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దానిలో భాగంగా ఒక శేరిలింగంపల్లి నియోజకవర్గం కు 1606 కోట్లు మన నియోజకవర్గం కు కేటాయించడం చాలా హర్షించదగ్గ విషయం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో H-CITI ఫేజ్-1 లో ఇప్పటికే పరిపాలనా అనుమతులను మంజూరు చేసిన రూ. 3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

నగరంలో వివిధ జంక్షన్ల సుందరీకరణకు రూ. 150 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన చేశారు.

నగరంలో వరదనీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ. 17 కోట్ల అంచనాలతో చేపట్టే పనుల ప్రారంభించారు.

రూ. 669 కోట్ల అంచనాలతో హైదరాబాద్ జల మండలి (HMWSSB) అధ్వర్యంలో నిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ప్రారంభించారు.

తాగునీటి సరఫరాకు అవుటర్ రింగ్ రోడ్డు ORR చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ. 45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు.

హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) అధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ. 1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు శంకుస్థాపన చేశారు.

అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్‌లైన్‌లో బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను సీఎంగారు లాంఛనంగా ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.1606 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన అభివృద్ధి పనులు

  1. మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్/ గ్రేడ్ సపరేటర్స్ 3 జంక్షన్స్ Rs.837.00 కోట్ల రూపాయలతో జంక్షన్ల అభివృద్ధి.

a. ఖాజాగూడ జంక్షన్
b. III T జంక్షన్
c. విప్రో జంక్షన్

2.రూ. 39.00 కోట్ల రూపాయలతో సీపీ సైబరాబాద్ కార్యాలయం నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు 215 అడుగుల రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు

  1. రూ.Rs.31 కోట్ల రూపాయలతో అంజయ్య నగర్ నుండి రాంకీ టవర్ వరకు 150 అడుగుల వరకు రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి పనులకు

4.రూ. 45 కోట్ల రూపాయలతో NH 65 నుండి అమీన్‌పూర్ వరకు 150/100 అడుగుల రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి పనులకు

  1. రూ.530 కోట్ల రూపాయల తో మియాపూర్ చౌరస్తా నుండి నుండి ఆల్విన్ చౌరస్తా వరకు 6 లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ మరియు లింగంపల్లి నుండి గచ్చిబౌలి వరకు 3 లేన్ యూని డైరెక్షనల్ అండర్ పాస్ నిర్మాణం పనులకు

6.రూ. 124 కోట్ల రూపాయలతో శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ROB నిర్మాణం పనులకు

    మొత్తము రూ..1606.00 కోట్ల రూపాయల నిధులు మంజూరి చేయడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.

TEJA NEWS