TEJA NEWS

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు

హైదరాబాద్ రామ భక్తులు శ్రీరాముడిపై తన ప్రేమను చాటుకున్నారు. శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని ఎన్.నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డు శనివారం అయోధ్యకు చేరుకుంది.

సుమారు 1,265 కేజీల బరువునన ఈ లడ్డు కరసేవక్‌పురంకు చేరుకున్నట్లు నాగభూషణం రెడ్డి తెలిపారు.

ఈ లడ్డు నెల రోజుల పాటు ఉంటుందని, 25 మంది కలిసి మూడు రోజులు పాటు శ్రమించి లడ్డు తయారు చేశామన్నారు.


TEJA NEWS