జీవన్ రెడ్డి కి నచ్చితే సక్రమం నచ్చకుంటే అక్రమం…ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.

జీవన్ రెడ్డి కి నచ్చితే సక్రమం నచ్చకుంటే అక్రమం…ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.

TEJA NEWS

If Jeevan Reddy likes it, it's legal, if he doesn't, it's illegal... MLA Dr. Sanjay Kumar.

జీవన్ రెడ్డి కి నచ్చితే సక్రమం నచ్చకుంటే అక్రమం…ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.

జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా ని కలిసి జగిత్యాల పట్టణములో 4 వార్డు లో అక్రమ నిర్మాణములపై శ్రీ టి . జీవన రెడ్డి MLC తగు చర్యలు తీసుకోవలేనని నిన్న తమరికి ఇవ్వబడిన ఫిర్యాధులను పురస్కరించుకొని మేము సమర్పించునది ఏమనగా, జగిత్యాల పట్టణములో అనేక వార్డులలో ఇంకనూ ఎన్నో అక్రమ నిర్మాణములున్నవి. ఇట్టి అక్రమ నిర్మాణములు, అనగా,

  1. అసలు అనుమతులు పొందకూడా నిర్మించినవి,
  2. అనుమతి పొందిననూ మంజూరికి విరుద్దంగా నిర్మాణములు చేపట్టినవి,
  3. అనుమతిలో మంజూరీ లేని నిర్మాణములు చేపట్టినవి
  4. జోన్ల మంజూరీ కి విరుద్ధంగా చేపట్టిన నిర్మాణములు .. అనగా, బట్టి వాడలో పాటశాల జోన్ మరియు, శంకులపల్లి విజయపురి యందు గృహ నిర్మాణములకు అనుమతులు ఇవ్వబడినవి . పొన్నాల గార్డెన్స్ వారికి జోన్ నియమాలకు విరుద్దముగా అనుమతి ఇవ్వబడినవి. హాస్పిటల్ జోన్ ( 7 వ వర్డ్ లో కూడా అనుమతులు ఇవ్వకుండా కూడా నిర్మాణములు చేపట్టబడినవి. వీరంధరికీ ఏ విదంగా ఇండ్ల నెంబర్లు కేటాయించినారో తెలుపగలరని కోరుచున్నాను.
  5. గృహ అవసరాలకు పేరిట అనుమతులు పొంది వాణిజ్య సముదాయములు గా మార్చినవి.
  6. సెట్ బ్యాక్ లేకుండా, 30 ఫీట్ల రోడ్డు వెడల్పు పాటించకుండా చేపట్టినవి.
  7. బై పాస్ రోడ్డు పై (కొత్త బస్ స్టాండ్ దగ్గర) మోతే/ ధరూరు గ్రామ పంచాయతీల నుండి అనుమతి తీసుకొని మునిసిపాలిటీలో విలీనము కాకముందే హౌస్ నెంబర్ లు ఇవ్వడము జరిగినది.

కావున, తమరు ఈ విషయములో ప్రత్యేక అధికారులను నియమించి విధంగా అనేక అక్రమ నిర్మాణములు చేపట్టినవాటిపై విచారణ చేపట్టి వెంటనే తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరుచున్నాము.

శ్రీయుత టి. జీవన రెడ్డి గారు ప్రతీకార చర్యలతో ఇచ్చిన కాంప్లయింట్లు ను డా. యం. సంజయ్ కుమార్ శాసన సభ్యులు, జగిత్యాల మరియు, BRS పార్టీ నాయకులు,జగిత్యాల మునిసిపాలిటి కౌన్సిలర్ లు ఖండిస్తున్నాము అని ఎమ్మెల్యే డా. యం. సంజయ్ కుమార్ , BRS పార్టీ నాయకులు,జగిత్యాల మునిసిపాలిటీ కౌన్సిలర్ లు వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు.

మీడియా తో ఎమ్మెల్యే మాట్లాడుతూ

మాజీ లైబ్రరీ డైరెక్టర్,పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మధ్యతరగతి యువకుడు ఇల్లు నిర్మించుకుంటే జీవన్ రెడ్డి గారు ఓర్వలేక కలెక్టర్ కి పిర్యాదు చేయడం వారికి,మున్సిపల్ నుండి నోటీస్ రావడం చాలా బాధాకరం,ఆశ్చర్యకరం గా ఉంది.

గత 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయం లో జగిత్యాల ప్రజల ఆశీర్వాదం తో గెలిచి పట్టణం లో మాస్టర్ ప్లాన్ లేకుండా అస్తవ్యస్తం గా మార్చారు జీవన్ రెడ్డి
పట్టణం లో ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నో నిర్మాణాలు జరిగాయి..
మాజీ ఛైర్మెన్ విజయ లక్ష్మి బట్టి వాడ లో స్కూల్ జోన్ లో ఇండ్ల నిర్మాణాలు ఎలా జరిగాయి అనుమతులు ఎలా ఇచ్చారు.
బి అర్ ఎస్ ప్రభుత్వం హయం లో జోన్ల మార్పు చేయటం జరిగింది..
14 జోన్ల ను 121 సర్వే నంబర్ లు రెగ్యులర్ చేశాం..
జోన్ల మార్పు చేసిన తర్వాత అన్ని వార్డుల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు..
గత సీనియర్ నాయకులు,మాజీ మంత్రి గా ఉండి జోన్ల మార్పు ఎందుకు చేయలేదు..
అనుమతులు లేక బ్యాంక్ లోన్ కూడా వచ్చే పరిస్తితి లేదు అని అన్నారు…
గత కాంగ్రెస్ మున్సిపల్ హయం లో ఎన్నో వందలాది ఇండ్లు అనుమతి లేకుండా నిర్మాణం జరిగింది…సమాధానం చెప్పాలి..
అక్రమ నిర్మాణాలు కూల్చే పరిస్తితి వస్తే జగిత్యాల లో భూకంపం వస్తుంది.
గత కాంగ్రెస్ హయం లో డ్రైనేజీ లు అస్తవ్యస్తం,ముప్పాల చెరువు పూర్తి గా పాడైంది..
మోతే చెరువు కలుషితం కాకుండా వీక్లీ బజార్ నుండి డ్రైనేజీ నిర్మించాం..
జగిత్యాల పట్టణం లో 2006 నుండి నేడు 2024 ఎంపి ఎన్నికల్లో సైతం జగిత్యాల ప్రజలు జీవన్ రెడ్డి నీ తిరస్కరించారు అని గుర్తుచేశారు…
…………………..

Print Friendly, PDF & Email

TEJA NEWS