అక్రమంగా మానవ ప్లాస్మాను విక్రయిస్తున్న రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) తెలిపింది.
హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్ బ్లడ్ సెంటర్, దారుల్‌షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ లైసెన్సులను రద్దు చేసినట్టు డీసీఏ డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు.