ఘనపు సముద్రం ముంపు రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలనీ
ప్రజావాణిలో వినతిపత్రం అందించిన రైతులు.
వనపర్తి :
వనపర్తి జిల్లాలోని
గణపురం మండల కేంద్రంలోని
ఘనపసముద్రం రిజర్వాయర్ ముంపు రైతులు జాయింట్ కలెక్టర్ ,కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ మరియు ప్రత్యేక అదనపు కలెక్టర్ (భూ సేకరణ) ర్లను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.గణప సముద్రం రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న భూముల రైతులు జూన్ జూలై నెలల లో అవార్డు కాఫీ ల పై సంతకం చేయడం జరిగింది. నేటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా బ్యాంకులో వారి ఖాతాలో డబ్బులు జమ కాలేదు. సంతకం చేసిన వారం రోజులలో డబ్బులు మీ ఖాతాలలో జమ అవుతాయని చెప్పి సంతకం చేయించుకోవడం జరిగినది. కానీ నేటి వరకు రైతులకు ప్రభుత్వం నుండి ఒక్క రైతుకు కూడా ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ని మరియు ప్రత్యేక అదనపు కలెక్టర్ భూ సేకరణని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగినది. రిజర్వాయర్లో ముంపునకు గురైన భూములకు డబ్బులు రావడానికి అధికారికంగా కార్యాచరణ పూర్తి చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ అన్నారు . ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు టోకన్స్ పంపడం జరిగిందని అదనపు కలెక్టర్ తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య , మాజీ జెడ్పిటిసి సామ్యానాయక్, నల్లమద్ది రవీందర్ రెడ్డి, నల్లమద్ది నరసింహారెడ్డి, బండారి శేషయ్య, ధోరెటి మల్లేష్, బద్గని చెన్నయ్య, బెస్త గోపాల్, కటిక శ్రీనివాసులు, గగ్గలపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆగారం గణేష్ , కోరమోని వెంకటస్వామి, మేతరి బాలస్వామి పాల్గొన్నారు
