TEJA NEWS

బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలి : కస్తూరి రాములు

సూర్యపేట జిల్లా ప్రతినిధి: రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 3,4 బిల్లులను రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బహుజన వేదిక రాష్ట్ర కన్వీనర్ కస్తూరి రాములు డిమాండ్ చేశారు. సోమవారం బీసీల రిజర్వేషన్ అంశంపై చిలుకూరు తహసిల్దార్ ధ్రువ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. 42 శాతం రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేసి, అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పోస్ట్లు, కమిషన్లు, బోర్డులు, సలహా మండల్ లో 90 శాతం ప్రాతినిధ్యం బీసీ,ఎస్సీ,ఎస్టీ లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, తగు ప్రాతినిధ్యం, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమని నమ్ముతున్నట్లు రాములు అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో అమరగాని లింగరాజు, దుగ్గెబోయిన రామకృష్ణ, అల్లి వినయ్ తదితరులు పాల్గొన్నారు.