TEJA NEWS

ఏ దేశంలో ఉన్నా..ఎంత ఉన్నతస్థానానికి ఎదిగినా స్వగ్రామాన్ని

సొంత రాష్ట్రాన్ని ప్రేమించడం. అభివృద్ధి చేయడం చాలా గొప్ప విషయం

….

  • పదిమందికి మేలు చేయని, సమాజ హితానికి ఉపయోగపడని జీవితం.. వ్యక్తిత్వం ఎప్పటికీ అసంపూర్ణమే.
  • హైదరాబాద్ లో స్థిరపడిన నాదెండ్ల గ్రామస్తుల కార్తీక మాస 6వ ఆత్మీయ సమావేశంలో మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి.

జీవితంలో ఎంత ఉన్నతస్థానానికి ఎదిగినా, జన్మనిచ్చిన తల్లిని.. పుట్టిన ఊరును ఎవరూ ఎప్పటికీ మర్చిపోరని, అలా సమాజానికి దూరంగా జీవించేవారు ఎన్నిఘనతలు సాధించినా అవన్నీ నిష్ప్రయోజనమేనని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. పదిమందికి మేలుచేయని, సమాజానికి ఉపయోగపడని వ్యక్తిత్వం. జీవితం ఎప్పటికీ అసంపూర్ణమేనని చెప్పారు.

హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన నాదెండ్ల గ్రామస్తుల 6వ ఆత్మీయ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రత్తిపాటి.. జంట నగరాల్లో స్థిరపడి, గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందించిన అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు.ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న తీరుగా తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా.. ఎంత ఉన్నతస్థానంలో ఉన్నా జన్మభూమిపై తమకున్న మమకారాని విడిపెట్టలేరని ప్రత్తిపాటి తెలిపారు. హైదరాబాద్ లో స్థిరపడి, వివిధ రంగాల్లో గొప్పగా స్థిరపడిన నాదెండ్ల గ్రామస్తుల పవిత్రమైన కార్తీక మాసాన గ్రామంలో సమావేశం కావడం అభినందించాల్సిన విషయమన్నారు. నాదెండ్ల గ్రామాన్ని రాష్ట్రంలో మేటిగా అభివృద్ధి చేయడంపై గ్రామస్తులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి, అందరూ ఏడాదిలో ఒక్కసారైనా సమావేశమై తమ గ్రామ..నియోజకవర్గ.. రాష్ట్ర ప్రగతికి తమవంతు చేయూత నందించాలని ప్రత్తిపాటి కోరారు. హైదరాబాద్ లో స్థిరపడిన గ్రామస్తులందరినీ ఒకచోటికి చేర్చి ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన స్థానిక కమిటీ సభ్యుల్ని ప్రత్తిపాటి అభినందించారు. కుటుంబసభ్యులతో సహా సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ లో స్థిరపడిన నాదెండ్ల గ్రామ వాస్తవ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటిని ఘనంగా సన్మానించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటికి వారు హమీ ఇచ్చారు. కార్యక్రమంలో బీ. వెంకటేశ్వరరావు, నల్లమోతు అమరేశ్వరరావు, కాట్రగడ్డ పరమేశ్వరరావు, నల్లమోతు కోటేశ్వరరావు, నల్లమోతు జయరాం, నాదెండ్ల గ్రామ కమిటీ సభ్యులు నల్లమోతు శివరాం ప్రసాద్, నల్లమోతు బాలమురళీ కృష్ణ, చేకూరి అమరేశ్వర్రావు, కాట్రగడ్డ పరమేశ్వరరావు, నల్లమోతు ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.