TEJA NEWS

[ ఘనంగా ఎర్రబెల్లి సతీష్ రావు పుట్టిన రోజు వేడుకలు

*అందరివాడు అని కొనియాడిన అభిమానులు
*శేరిలింగంపల్లి భావి ఆశా దీపం అన్న అనుచరులు

నాయకుడు అంటే కేవలం ఎన్నికలప్పుడేకాదు… ప్రతీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ… వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ…ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనుదినం పోరాడేవాడు… అన్నా అంటే… నేను ఉన్నా అని అర్ధరాత్రి అయినా సమాధానం ఇచ్చేవాడు… అసలైన నాయకుడు. ఈ మాటకు అచ్చ తెలుగు అర్థంలా నిలుస్తారు సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి సతీష్ రావు అని ఆహుతులు కొనియాడారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఇన్చార్జ్ ఎర్రబెల్లి సతీష్ రావు జన్మదిన వేడుకలు ఎల్లమబండ లోని గోధా కృష్ణ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఇన్చార్జ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని సతీష్ రావుతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేపీహెచ్బీ ఏఎస్ రాజు కాలనీలో ఉన్న సతీష్ రావు స్వగృహం నుంచి ఎల్లమబండ లోని గోధా కృష్ణ ఫంక్షన్ హాల్ వరకు జరిగిన ర్యాలీలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. టపాసులు కాల్చి పండగ వాతావరణం తలపించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఎర్రబెల్లి సతీష్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.