
గంగమ్మ ఆలయం వద్ద ఆకట్టుకున్న వేషధారణలు..
** భక్తి ప్రపత్తులతో అమ్మవారికి మరు పొంగళ్ళు
తిరుపతి: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో మరు పొంగళ్ల జాతర అత్యంత వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే ఐదు మరుపొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు అమ్మవారి దర్శనం ఏర్పాట్లను చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో జాతర తరువాత జరుగు 5 వారాల మరుపొంగళ్లలో తమ కళాకారులు వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కెఎన్ రాజా, కన్నప్ప గారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఇర్ల గుణశేఖర్, జయమ్మ, సాయినవీన, చంగల్ రాయులు, వాసు, దీపక్ యాదవ్, దేశ నాగేశ్వరరావు, మల్లారపు రవి ప్రసాద్, మేకల గంగయ్య, కోదండపాణి, పార్వతి, ధనలక్ష్మి, కళ్యాణి, పద్మావతమ్మ తదితరులు పాల్గొన్నారు.
