ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ
శివ శంకర్. చలువాది
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్ జబువాలో మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్ కూడా హాజరయ్యారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘనవిజయం సాధిస్తుందన్నారు మోదీ.
ఆదివాసీ ప్రాంతాలపై ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు . అందుకే జాబువాలో సభ నిర్వహించారు. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయమన్నారు మోదీ. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించడం ఖాయమన్నారు మోదీ. బీజేపీ సొంతంగా 370 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల తరువాత ఇండియా కూటమి మాయమవుతుందన్నారు
“ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని విపక్ష ఎంపీలే పార్లమెంట్‌లో చెబుతున్నారు. 2024 మరోసారి మోదీ సర్కార్ ఖాయం. ఎన్డీఏకు 400 సీట్లు తప్పకుండా వస్తాయి ” అని మోదీ పేర్కొన్నారు.