TEJA NEWS

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు మధులత, మరియు సీనియర్ నాయకులు బాలస్వామి, మోజెస్, పోశెట్టిగౌడ్, యాదగిరి, ఫారూఖ్, ఖాలీమ్, భిక్షపతి, రవీందర్, పుట్టం దేవి, సరిత, పర్వీన్, యస్మిద్, మహముదా లు కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరితో పాటు సుమారు వందమంది కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేసి చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, అగ్రవాసు, సంగమేష్, రాజు, అరుణ, బాలస్వామి సాగర్, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS