Spread the love

కోదాడ పట్టణంలో శ్రీ శ్రీనివాస వాటర్ ప్యూరిపైర్స్ ప్లాంట్ ప్రారంభం.. మంచి లాభాలతో వ్యాపార రంగంలో రాణించాలి.
సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్.

కోదాడ సూర్యాపేట జిల్లా)
మంచి లాభాలతో వ్యాపార రంగంలో రాణించాలని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు లో ప్రోప్రైటర్ మిర్యాల శీను గౌడ్, మీర్యాల గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ శ్రీనివాస వాటర్ ప్యూరిఫైర్స్ ప్లాంటును ప్రారంభించారు.
అనంతరం అంజన గౌడ్ మాట్లాడుతూ, పట్టణంలోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించే ఉద్దేశంతో ప్యూరి ఫైర్స ను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. యువత చెడు మార్గంలో కాకుండా వ్యాపార రంగంలో రాణించాలని అన్నారు. ప్లాంట్ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రొప్రైటర్లు మాట్లాడుతూ, ఏర్పాటుచేసిన నూతన ప్యూరిఫైర్స్ ప్లాంటు నందు జీరో డౌన్ పేమెంట్ తో , ప్రతినెల వీఎంఐ సౌకర్యంతో ప్యూరిఫైడ్ను కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఒక సంవత్సరం గ్యారెంటీతో హోల్సేల్ అండ్ రిటైల్ గా అమ్మబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, టీపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కెఎల్ఎన్ ప్రసాద్ గౌడ్, అమర గాని కాశయ్య గౌడ్, బెల్లంకొండ గోవర్ధన్ గౌడ్, కొండ ఉపేందర్ గౌడ్ ,వేదశ్రీ వెంకటేశ్వర్లు గౌడ్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.