ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం : లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అశ్వారావుపేట పోలీస్ హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలంలో
మొంథా తుఫాన్ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డిడిఆర్ఎఫ్ సిబ్బంది అశ్వారావుపేటలో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగిపోయే ప్రాంతాలను డి డి ఆర్ ఎఫ్ సిబ్బందితో అశ్వారావుపేట సిఐ పి. నాగరాజు రెడ్డి, ఎస్ఐ టి.యయాతి రాజు మరియు సిబ్బంది పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచనలు చేశారు. మండల ప్రజలకు ఎటువంటి అవసరమైన వెంటనే పోలీసుకు సమాచారం అందించవలసిందిగా సూచించారు.
